Jul 18,2021 06:33

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : దేశం అంతటా నైరుతి విస్తరించిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ద్రోణులు నెలకొన్నాయి. శనివారం పడమర ద్రోణి ఒకటి ఏర్పడింది. సముద్ర మట్టం నుంచి తూర్పు పడమర ద్రోణి ఉత్తర అరేబియా సముద్రం నుంచి దక్షిణ తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఉత్తర మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా 3.1 కిలోమీటర్లు, 4.5 కిలోమీటర్ల మధ్య ఎత్తులో దక్షిణ దిశగా ఏర్పడింది. ఈ నెల 21న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు ఇదివరకే వెల్లడించారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర పరిసరాలపై ఇదివరకే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. వీటి ప్రభావంతో ఏపిలోని ఉత్తర కోస్తాలో రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.