Jun 02,2023 22:05

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో జెస్సికా పెగూలా ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన మూడోరౌండ్‌ పోటీలో పెగూలా 1-6, 3-6తో బెల్జియంకు చెందిన ఎలీసే మెర్టెన్స్‌ చేతిలో ఓటమిపాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పెగూలా 3వ ర్యాంక్‌లో ఉండగా.. ఇటీవల రెండు డబ్ల్యుటిఏ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. ఇక పెగూలా నెగ్గిన ఎలీసే మెర్టెన్స్‌ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది.
అల్కరాజ్‌ సునాయాసంగా..
పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి టాప్‌సీడ్‌, స్పెయిన్‌కు చెందిన యువ ఆటగాడు కార్లోస్‌ అల్కరాజ్‌ ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన 2వ రౌండ్‌ పోటీలో అల్కరాజ్‌ 6-1, 3-6, 6-1, 6-2తో టోరో డానియేల్‌(జపాన్‌)పై వరుససెట్లలో నెగ్గాడు. మరో పోటీలో డానిస్‌ షపొవొలోవ్‌(రష్యా) 6-2, 3-6,న 6-3, 6-3తో మట్టో అమల్డి(ఇటలీ)పై, లారెంజో మసెట్టి(ఇటలీ) 6-1, 6-1, 6-2తో అలెగ్జాండర్‌(రష్యా)పై నెగ్గి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లారు. ఇక సీడెడ్‌ క్రీడాకారులు కామెరూన్‌ నొర్రీ(బ్రిటన్‌), ఫోగ్నిని(ఇటలీ), స్వాట్జ్‌మన్‌(అర్జెంటీనా), సిట్సిపాస్‌(గ్రీక్‌), జకోవిక్‌(సెర్బియా) ప్రత్యర్థులపై నెగ్గిన ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకొచ్చారు. ఇక 7వ సీడ్‌ రుబ్లేవ్‌(రష్యా), 8వ సీడ్‌ జన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ), 16వ సీడ్‌ టామీ పాల్‌(అమెరికా), 18వ సీడ్‌ అలెక్స్‌ాడిామినార్‌(ఆస్ట్రేలియా), 19వ సీడ్‌ బటిస్టా అగట్‌(స్పెయిన్‌) మూడోరౌండ్‌లో అన్‌సీడెడ్‌ క్రీడాకారుల చేతిలో ఓటమిపాలయ్యారు.