Jul 09,2023 18:00

ప్రజాశక్తి-కర్నూలు స్పోర్ట్స్ : రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి షూటింగ్ రేంజ్ లో జూన్ 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించిన 23వ రాష్ట్ర స్థాయి ఎయిర్, స్మాల్, షాట్ గన్ షూటింగ్ పోటీల్లో కర్నూలు జిల్లా వాసి ఎం.శ్రీహర్ష 25 మీటర్ పురుషుల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని(మూడవ స్థానం) కైవసం చేసుకున్నారు. ఆదివారం విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ లో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హాజరైన రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సలాలిత్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, సహాయ కార్యదర్శి మౌక్తిక్ రెడ్డి చేతులు మీదుగా శ్రీహర్ష కాంస్య పతకాన్ని అందుకున్నారు. గతంలో జరిగిన రాష్ట్ర స్థాయి 25 మీటర్ పురుషుల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో శ్రీహర్ష రెండు రజత పతకాలను సాధించారు.