May 02,2023 22:57

ప్రజాశక్తి-విజయవాడ రూరల్‌: విజయవాడ రూరల్‌ మండలం నున్నలోని వికాస్‌ విద్యా సంస్థల నుండి 2022-23 విద్యా సంవత్సరంలో 360 మందికి పైగా విద్యార్థులు క్యాప్‌జెమినీ, ఇన్ఫోసిస్‌, ఐసిఐసిఐ మరియు ఇతర బహుళజాతి కంపెనీలలో ప్లేస్‌మెంట్‌లు పొందారు. ఈ సందర్భంగా కళాశాల క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్‌ పొందిన విద్యార్థులందరినీ కళాశాల యాజమాన్యం మంగళవారం సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ట్రై లాజిక్‌ సాఫ్ట్‌ సొల్యూషన్స్‌, హైదరాబాద్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ రవి కుమార్‌ వివిధ బహుళజాతి కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌లు పొందిన విద్యార్థులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. పలు కంపెనీల్లో 360 ప్లేస్‌మెంట్లు సాధించిన వికాస్‌ విద్యాసంస్థల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు కేవలం విద్యార్హతలే కాకుండా ఇతర కార్యక్రమాల్లోనూ తమ ప్రతిభను కనబర్చాలని సూచించారు.గ్రామ/వార్డు సచివాలయాల్లో అనేక మంది వికాస్‌ విద్యాసంస్థల విద్యార్థులు ఉపాధి పొందారని ఆయన గుర్తు చేశారు. ప్లేస్‌మెంట్‌లు పొందేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సంస్థ యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు. వికాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ బి రమణ, డాక్టర్‌ బి రామమోహనరావు, ప్లేస్‌మెంట్‌ అధికారి ఎస్‌ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.