31 నాటికి 'కల్యాణం' ఏర్పాట్లు పూర్తి చేయాలిటిటిడి ఇఒ ఎ.వి. ధర్మారెడ్డి
ఒంటిమిట్ట : టిటిడి అధికారులు, జిల్లా యంత్రాంగం కలిసి ఈనెల 31 నాటికి శ్రీ సీతారాముల స్వామివారి కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి ఇఒ ఎ.వి. ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కడప కలెక్టర్ విజరురామరాజు, ఎస్‌పి అన్బురాజన్, జిల్లాలోని వివిధ శాఖల అధిక ారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ టిటిడి అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకుని బ్రహ్మో త్సవాలను విజయవంతం చేయాలన్నారు. కల్యాణ వేదిక వద్ద సిసి కెమెరాలు, కంట్రో ల్‌రూమ్, బారికేడ్లు, గ్యాలరీలు, విద్యుత్ ఇతర పనులు పూర్తి చేయాలన్నారు. ఈనెలఖరులోగా మరోసారి పనుల పురోగతిపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహి స్తామన్నారు. శ్రీసీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. కల్యానానికి విచ్చేసే భక్తులకు వారి గ్యాలరీల్లోనే అన్నప్రసాదం, తాగునీరు, అక్షిం తలు అందించేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ కల్యాణనికి వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట ్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్న పసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, హెల్ప్ డెస్క్ లు, సైన్ బోర్డులు, పారిశుధ్యం, విఐపి పాసులు, పార్కింగ్ ప్రదేశాలు,పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులతో పాటు టీటీడీ లోని ఆయా విభాగాధిపతులతో కమిటీలు నియమించామన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ గత ఏడాది 3,500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ సారి 4 వేల మందిని నియ మిస్తున్నామని చెప్పారు. పార్కింగ్, సిసి కెమెరాలు, కంట్రోల్ రూమ్ నిర్వహణకు సంబ ంధించిన సిబ్బంది రెండు రోజుల పాటు విధుల్లో ఉం టారని తెలిపారు. అనంతరం బ్రహ్మోత ్సవాలకు సంబం ధించిన పోస్టర్లను ఆవిష్క రించారు. కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జెఇఒ వీర బహ్మం, జెసి సాయికాంత్‌వర్మ, టిటిడి సిఇ నాగేశ్వరరావు పాల్గొన్నారు.










