ప్రజాశక్తి-నందిగామ : రెండవ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కే గోపాల్ మాట్లాడుతూ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్ వెంటనే విడుదల చేయాలని, కార్మికులు పని భారం తగ్గించాలని కార్మికులు చేసే రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ సీనియర్ కార్యదర్శి పసుపులేటి సైదా మాణిక్యం సతీష్ చంద్ర లక్ష్మణరావు గరికపాటి ప్రసాదు రుతుమ పుల్లయ్య కార్మికులు పాల్గొన్నారు.










