హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో లారస్ ల్యాబ్స్ లాభాలు 88.8 శాతం పతనమై రూ.28.40 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.252.5 కోట్ల లాభాలు నమోదయ్యాయి. ఇదే సమయంలో రూ.1,539 కోట్ల రెవెన్యూ ఆర్జించగా.. గడిచిన క్యూ1లో 23.2 శాతం తగ్గి రూ.1,181.8 కోట్లుగా చోటు చేసుకుంది.