రాయచోటి : మండల పరిధిలోని చెన్నముక్కపల్లిలో ఉన్న లయన్స్ కంటి ఆస్పత్రిలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 24 మందికి ఆపరేషన్లు ఆదివారం నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంతో పాటు జిల్లా పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరు, కలికిరి, కలకడ, గుర్రంకొండ, పెద్దమండెం, యర్రా వారిపాలెం, కె.వి. పల్లి, కదిరి, ఎస్‌పి కుంట తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 50 మందికి పరీక్షలు నిర్వహించి అందులో అర్హులైన 24 మందికి ఆపరేషన్లు చేశారు. గతంలో ఆపరేషన్ చేయించుకున్న 30 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్ వైవిఆర్ స్వరూప్ గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెన్నూరు అన్వర్‌బాష, ఎపిఐఐసి డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, కంటి వైద్యులు సురేష్ బాబు, భార్గవి, ఆప్త్మాలిక్ అసిస్టెంట్ మూలి రాజగోపాల్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు










