Aug 17,2022 22:52

ప్రజాశక్తి కలక్టరేట్‌
గ్రామాల్లో జరుగుతున్న అభివద్ధి, సంక్షేమం తదితర కార్యక్రమాలపై జిల్లాలో రూపొందించిన గ్రామదర్శిని పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి లాంఛ నంగా ఈ నెల 23వ తేదీ పెడనలో బహిరంగ సభ నుంచి ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్‌ సి.రంజిత్‌ బాషా చెప్పారు. బుధవారం ఆయన జిల్లా అధికారులు, ఉద్యోగులతో వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం.పథకం కింద నాల్గవ విడత నిధుల పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23న తేదీ ఉదయం సింఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెడన పట్టణానికి వస్తున్నారన్నారు. బహిరంగ సభ విజయవంతం చేసేలా అధికారులంతా కలసికట్టుగా పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ఎస్పీ పి.జాషువా, జాయింట్‌ కలెక్టర్‌ డా. మహేష్‌ కుమార్‌ రావిరాల, డిఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు బందరు, గుడివాడ, ఉయ్యూరు ఐ.కిషోర్‌, పద్మావతి, విజరు కుమార్‌ లు, ముడా వీసి నారాయణ రెడ్డి, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.