Dec 10,2022 20:28

ముంబయి : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా (ఎఐ) 150 బోయింగ్‌ 737 మాక్స్‌ జెట్స్‌ను కొనుగోలు చేయనుందని సమాచారం. దీనికి సంబంధించిన ఒప్పందాలను త్వరలోనే చేసుకోనుందని తెలుస్తోంది. ఎఐని టాటా గ్రూపు స్వాధీనం చేసుకున్న తర్వాత దాదాపు 50 బిలియన్‌ డాలర్ల మెగా ఆర్డర్లపై దృష్టి పెట్టిందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.