- తమిళనాడు చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న అండమాన్ నికోబార్ టీం
- మహారాష్ట్ర చేతిలో ఓడిన పాండిచ్చేరి టీం
ప్రజాశక్తి-కాకినాడ కార్పొరేషన్ : కాకినాడ జిల్లా ప్రాధికార సంస్థ మైదానంలో 13వ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ పోటీలు రెండవ రోజు కొనసాగాయి.అయితే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు మ్యాచ్లు పూర్తి ఏకపక్షంగా సాగాయి. ఉదయం 9 గంటలకు మహారాష్ట్ర- పాండిచ్చేరి టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్లొ పాండిచ్చేరి ఒక్క గోలు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా మహారాష్ట్ర టీం 7 గోల్స్ వేసి విజయం సాధించింది. మొదటి నిమిషం నుంచే మహారాష్ట్ర దూకుడు ప్రదర్శిస్తూ పాండిచ్చేరి టీంకు చుక్కలు చూపించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మానశ్రీ నరేంద్ర సుజ్జి నిలిచింది.
- ఏమాత్రం పోరాటం లేకుండానే...
తమిళనాడు- అండమాన్ నికోబార్ టీం మధ్య జరిగిన మ్యాచ్లో ఏమాత్రం పోరాటపడిన చూపించకుండా అండమాన్ టీమ్ చేతులెత్తేసింది.ప్రత్యర్థి టీం గోల్స్ వేస్తుంటే కనీసం పోరాటపాటిమని చూపించలేదు.తమిళనాడు టీం ఏకంగా 32 గోల్స్ వేసిందంటే అండమాన్ నికోబార్ టీం ఏ విధంగా చేతులెత్తేసిందా అర్థం చేసుకోవచ్చుఏ విధంగా చేతులెత్తేసింది అర్థం చేసుకోవచ్చు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా తమిళనాడు టీమ్ కి చెందిన తమిళనాడు టీంకి చెందిన ప్రియాంక నిలిచింది.
- నేటి మ్యాచ్ వివరాలు
ఉదయం 7:00: ఒడిస్సా- కేరళ
ఉదయం 8:45 : మధ్యప్రదేశ్- తెలంగాణ
ఉదయం 10:30: హిమాచల్ - గుజరాత్
సాయంత్రం 3:45: ఆంధ్రప్రదేశ్ - బెంగాల్










