Jul 14,2023 08:04

బ్యాంకాక్‌ : ఆసియా అథ్లెటిక్స్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి జ్యోతి యర్రాజి మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. గురువారం జరిగిన 100మీ. హర్డిల్స్‌ ఫైనల్స్‌లో విశాఖకు చెందిన 23ఏళ్ల జ్యోతి 13.09సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ పోటీల్లో జ్యోతికి ఇదే తొలి స్వర్ణం. దీంతో ఆసియా అథ్లెటిక్స్‌ పోటీల్లో జ్యోతి దేశానికి తొలి స్వర్ణం అందించింది.