లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ట్యునీషియాకు చెందిన 6వ సీడ్ ఓన్స్ జబీర్, రష్యాకు చెందిన 2వ సీడ్ అర్యానా సబలెంకా ప్రవేశించారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ పోటీల్లో జబీర్.. 3వ సీడ్ ఎలేనా రైబకినా(కజకిస్తాన్)పై, సబలెంకా అమెరికాకు చెందిన 25వ సీడ్ కీస్‌పై విజయం సాధించారు. తొలి క్వార్టర్‌ఫైనల్లో సబలెంకా 6-2, 6-4తో వరుససెట్లలో కీస్‌ను చిత్తుచేయగా.. ఉత్కంఠ పోరులో సబీర్ 6-7(5-7), 6-4, 6-1తో రైబకినాను ఓడించింది. సబీర్ గత ఏడాది వింబుల్డన్, యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ రన్నరప్ కాగా.. ఈ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ఇక సబలెంకా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను చేజిక్కించుకోగా.. 2021లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌కు చేరింది.
మహిళల సింగిల్స్ సెమీస్..
వోండ్రుసోవా × స్విటోలినా
సబలెంకా × జబీర్










