Jul 11,2023 21:55

బెంగళూరు: వెస్ట్‌జోన్‌, సౌత్‌జోన్‌ జట్ల మధ్య దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సెమీస్‌లో సౌత్‌జోన్‌ జట్టు 2వికెట్ల తేడాతో నార్త్‌జోన్‌ను, సెంట్రల్‌ జోన్‌తో జరిగిన సెమీస్‌లో వెస్ట్‌జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతతో ఫైనల్‌కు చేరాయి. దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌లో చిన్నస్వామి స్టేడియంలో జరగనుండగా.. ఈ ట్రోఫీని వెస్ట్‌జోన్‌ జట్టు రికార్డుస్థాయిలో 34సార్లు కైవసం చేసుకొంది. సౌత్‌జోన్‌ జట్టుకు హనుమ విహారి, వెస్ట్‌జోన్‌ జట్టుకు ప్రియాంక్‌ పంఛల్‌ కెప్టెన్‌గా ఉన్నారు. ఇక వెస్ట్‌జోన్‌ జట్టు పృథ్వీ షా, ఛటేశ్వర పుజారా, సూర్యకుమార్‌ యాదవ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లతో పటిష్టంగా ఉండగా.. సౌత్‌ జోన్‌ జట్టులో మయాంక్‌ అగర్వాల్‌, విహారి, రికీ బురు, తిలక్‌ వర్మ, సుందర్‌ తదితర ఆటగాళ్లతో పటిష్టంగా కనబడుతోంది. దీంతో ఇరుజట్ల మధ్య జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం ఖాయం.