Dec 15,2022 21:01

లండన్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను వేల కోట్లకు మోసం చేసి బ్రిటన్‌ పారిపోయిన నీరవ్‌ మోడీకి అక్కడ న్యాయ పరంగా అన్ని దారులు మూసుకుపోయాయి. తనను భారత్‌కు అప్పగించకూడదని నీరవ్‌ అక్కడి సుప్రీంకోర్టును సంప్రదించడానికి అవకాశం ఇవ్వాలనే అప్పీల్‌ను హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆ ఆర్థిక నేరగాన్ని భారత్‌కు అప్పగించే ప్రక్రియ సులభం కానుంది. అయితే.. భారత్‌కు అప్పగించే అంశంలో యూరప్‌ సమాఖ్య మానవ హక్కుల కోర్టును నీరవ్‌ ఆశ్రయించడానికి వీలుంది. గుజరాత్‌ కేంద్రంగా వజ్రాల వ్యాపారం చేసిన నీరవ్‌ మోడీ పిఎన్‌బికి దాదాపుగా రూ.12వేల కోట్లకు మోసం చేశారు. టెక్నికల్‌గా, అక్రమంగా దోచేసి 2018లో పారిపోగా.. 2019లో లండన్‌లో అరెస్ట్‌ అయి ప్రస్తుతం కటకటాల్లో ఉన్నారు.