ఢాకా: బంగ్లాదేశ్ జట్టు సంచలనం సృష్టించింది. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో, చివరి టి20లో బంగ్లాజట్టు 16పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158పరుగులు చేసింది. ఓపెనర్ లింటన్ దాస్(73), రోనీ(24)కి తోడు శాంటో(47నాటౌట్) బ్యాటింగ్‌లో మెరిసారు. రషీద్, జోర్డాన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6వికెట్లు కోల్పోయి 142పరుగులే చేయగల్గింది. ఓపెనర్ మలన్(53), కెప్టెన్ బట్లర్(40) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. తస్కిన్‌కు రెండు, తన్వీర్, షకీబ్, ముస్తఫిజుర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లింటన్ దాస్‌కు, సిరీస్ నజ్ముల్ హొసైన్‌కు లభించాయి.











