న్యూఢిల్లీ : ప్రస్తుతం ఏ గ్రామాల్లో అయితే హై స్పీడ్ బ్రాడ్‌బాండ్ అందుబాటులో లేదో ఆ ఊర్లన్నిటికీ బిఎస్‌ఎన్‌ఎల్ స్పీడ్ నెట్‌ను తీసుకురానున్నామని టెలికం శాఖ సెక్రటరీ కె రాజరమన్ అన్నారు. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ వచ్చే ఏడాది లోగా అన్ని గ్రామాలకు నెట్ సేవలను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించిందన్నారు. దీనికి సంబంధించిన మౌలిక వసతుల కోసం పలు కాంట్రాక్టులను అప్పగించే ప్రక్రియ తుది దశలో ఉందన్నారు.










