మెదక్ : సీఎం కేసీఆర్ త్వరలోనే బీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని, అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను తఅణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప నాయకుడు ఆయన. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే టీఆర్‌ఎస్ పార్టీ కోసం తన ఇంటినిచ్చిన గొప్ప నాయకుడు కొండా బాపూజీ అని ప్రశంసించారు.కేసీఆర్‌కు ముందు, కేసీఆర్ వచ్చాక పట్టణంలో ఏం జరిగిందో మీరే బేరీజు వేసుకోవాలి. ఈ ఒక్క రోజే రూ. 50 కోట్ల విలువైన అభివఅద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇంత పురోగతి కనిపిస్తున్నా ఏమీ జరగలేదని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.కరోనా విపత్తులో సైతం ఆసరా పెన్షన్ ఆగలే. కళ్యాణ లక్ష్మి ఆగలేదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.










