ప్రజాశక్తి-వెదురుకుప్పం : ఎంఇఓగా బాధ్యతలు చేపట్టేందుకు వెదురుకుప్పంలో ఎవరూ ముందుకు రాని పరిస్థితి విద్యాశాఖలో ఏర్పడింది. సంవత్సరాల తరబడి ఇంచార్జి ఎంఇఓ విజయకుమార్ కు బాధ్యతల్లో ఉన్నారు. ఎట్టికేలకు ఇటీవల రెగ్యులర్ ఎంఇఓగా వసుమతీదేవి నియామకం జరిగింది. అయితే బాధ్యతలు స్వీకరించిన 20 రోజుల్లోనే దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంచార్జి బాధ్యతలు చేపట్టాలని విజయకుమార్ కి ఉత్తర్వులు అందచేశారు. నెలరోజులుగా బాధ్యతలు చేపట్టని ఇంచార్జి ఎంఈఓ. దీంతో ఎంఇఓ ఛాంబర్ కు తాళం పడింది. విద్యాశాఖ సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పొందుపరిచే ఇద్దరు సిబ్బందిలో ఒకరు విధుల నుంచి తొలగించారు. మరొకరికి తిరుపతి జిల్లా విద్యాశాఖ కార్యాలయంకి డిప్యుటేషన్ వేశారు. దీంతో మండల విద్యాశాఖ కార్యాలయం ఖాళీ అయ్యింది. ఎంఈఓ లేక ఈనెల జీతం టీచర్ లకు అనుమానమేనని తెలుస్తోంది. ఏమాత్రం పట్టించుకోని జిల్లా విద్యాశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి దాపురించింది.










