వెదురుకుప్పం (చిత్తూరు) : దివ్యాంగుడి కుటుంబానికి ఇంటిని మంజూరు చేయాలని కోరుతూ ... మంగళవారం వెదురుకుప్పం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జనసేన నేతలు దీక్ష చేపట్టారు. మొండివెంగనపల్లె పంచాయతీ నెమళ్లగుంటకు చెందిన దివ్యాంగుడైన నాగరాజు కుటుంబానికి ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ యుగంధర్.పొన్న, తదితరులు పాల్గొన్నారు.










