వెదురుకుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, సంతబయలు గ్రామంలో స్థానిక సర్పంచ్ బోడిరెడ్డి రాజేశ్వరి ఆధ్వర్యంలో ' మా నమ్మకం నువ్వే జగన్...' కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు గృహ సారధుల మండల కన్వీనర్ బట్టే సుబ్రహ్మణ్యం, వైసీపీ నేత బోడిరెడ్డి పెద్దరెడ్డి, స్థానికులు ఉన్నారు.










