Mar 20,2023 16:43

ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో నార్పల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పండ్ల తోటలు వివిధ రకాల పంటలు పూర్తిగా నాశనమై మండల రైతులు వందలాది ఎకరాల్లో పంట నాశనమై కోట్లాది రూపాయలు పంట నష్టపోవడం జరిగిందని పంట నష్టాన్ని అంచనా వేయడానికి సోమవారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దివాకర్ అధ్యక్షతన మండల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అధికారులు వీఆర్వోలో పంచాయతీ కార్యదర్శులతో కలిపి మూడు నాలుగు టీంలుగా ఏర్పాటు చేసి పంట నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందని తాసిల్దార్ నారాయణస్వామి ఎంపీడీవో దివాకర్ తెలిపారు. నార్పల మండల వ్యాప్తంగా శనివారం కురిసిన వడగండ్ల వాన కు ఇంత వరకు దెబ్బ తిన్న పంటల వివరాలుఅరటి...1,322 ఎకరాల్లోమామిడి = 260 ఎకరాల్లోచిని 290ఎకరాల్లో పొప్పాయ 20ఎకరాల 23 ఎకరాల్లో టమోటా = 12 ఎకరాల్లో మొక్కజొన్న  474 ఎకరాల్లో వేరుశనగ = 125 ఎకరాల్లో వరి = 80 ఎకరాల్లో ఉద్దులు = 15 ఎకరాల్లో పంట దంచమైనట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారి కృష్ణయ్య ఎస్సై రాఘవరెడ్డి విద్యుత్ ఏఈ రఘునాథ్ బాబు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ రవీంద్రనాథ్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి ముస్తఫా ఏపీవో ఓబన్న ఏపీఎం తిప్పమ్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..