Jul 27,2023 13:25
  • ప్రజాశక్తి కథనానికి స్పందించిన ఎమ్మెల్యే పద్మావతి

ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని గుగుడు గ్రామంలో గూగూడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచాయతీలో గేటు వసూలు చేసుకునే వేలం పాడిన వేలంపాటదారులు పంచాయతీ నిర్ధారించిన రేట్ల కంటే అధికంగా గేటు వసూలు చేస్తున్నారంటూ కుళాయి స్వామి భక్తులకు బాదుడే బాదుడు అంటూ గురువారం ప్రజాశక్తిలో ప్రచురితమైనది. ఈ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భక్తులకు ఇబ్బంది కలగకుండా గేటు అధికంగా వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికంగా వసూలు చేసే వారిని పిలిపించి ఇలా చేస్తే వేలం రద్దు చేస్తామని హెచ్చరించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు నిబంధనల మేరకు ద్విచక్ర వాహనాలకు ఎటువంటి రుసుము లేదని ఆటోకి 30 రూపాయలు, కారుకి 50 రూపాయలు ఆపైన భారీ వాహనాలకు 70 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని అంతకుమించి వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఎంపీడీవో దివాకర్ ఆలయ కార్యనిర్వాహణాధికారి శోభ తెలిపారు.