Dec 09,2020 00:46

గ్రామ సందర్శనలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌

నాతవరం : మండలంలోని డి.యర్రవరం, వెంకయ్యపాలెం, గోవిందపురం, జిల్లేడుపూడి, లక్ష్మీపురం, పార్వతీపురం, చెర్లోపాలెం గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష హాజరై మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు, సచివాలయ భవనాల నిర్మాణం, నాడు- నేడుతో పాఠశాలల అభివృద్ధి పనులను చూసి ఆశీర్వదించాలని కోరారు. గ్రామాల్లో విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అంకంరెడ్డి జమీలు, శెట్టి నూకరాజు, పైల సునీల్‌, పైల పోతురాజు, గొర్లె వరహలబాబు, మంకు సాంబమూర్తి, బండారు నాయుడు, మాకి రమణ, లాలం లోవ, సబ్బవరపు వెంకునాయుడు పాల్గొన్నారు.