Apr 06,2023 14:42

ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం) : మండలంలోని కందికాపుల, బాలాపురం, కోమటికుంట్ల సచివాలయాలను డివిజనల్‌ డెవలప్మెంట్‌ అధికారి సి.ఓబులమ్మ గురువారం తనిఖీ చేశారు. బయోమెట్రిక్‌ హాజరు, మూవ్మెంట్‌ రిజిస్టర్‌, స్పందన రిజిస్టర్‌లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యూనిఫామ్‌ తప్పనిసరిగా ధరించాలని, అందరు సచివాలయం సిబ్బంది ప్రజల నుండి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలి అని ఆదేశించారు. గర్భిణీ స్త్రీలు, 0 నుండి 5, 6 నుండి 19 సంవత్సరాల పిల్లల వివరాలు సుస్తిరాభివృద్ధి లక్ష్యాల యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు సచివాలయం, ఆర్బీకె, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలు నిర్మాణాలు, గడప గడపకు మన ప్రభుత్వం నిధులకు సంబంధించిన పనులను, జల్‌ జీవన్‌ మిషన్‌ నిధుల పనులు త్వరగా పూర్తీ చేయాలని ఆదేశించారు. కోమటికుంట్లలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో తడిచెత్త పొడిచెత్త సేకరణ, వెర్మికంపోస్ట్‌ ఎరువు తయారీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యోగానంద రెడ్డి సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.