నాతవరం : నాతవరం మండలం సరుగుడు, కెవి.శరభవరం, చమ్మచింత గ్రామాల్లో వైఎస్‌ఆర్ గ్రామ సందర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను వివరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ సందర్శనలో తన దృష్టికి వచ్చిన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సరుగుడులో వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగనన్న తోడు పథకంలో అర్హులైన లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శెట్టి నూకరాజు, పైల సునీల్, పోతురాజు, ఎస్.లక్ష్మణమూర్తి, బండి గంగరాజు పాల్గొన్నారు.










