Feb 11,2021 00:51

తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-నాతవరం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాతవరం మండలం చిక్కుడుపాలెం చెక్‌ పోస్టు వద్ద వాహనాలను బుధవారం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై కల్యాణ్‌రాజు, ఆర్‌ఐ నారాయణ, గంగరాజు, బాలరాజు పాల్గొన్నారు.