Jan 24,2021 00:35

మాట్లాడుతున్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ మల్లేశ్వరి

నాతవరం : నాతవరం మండలంలో రానున్న వేసవి కాలంలో తాగు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అసిస్టెంట్‌ ఇంజినీర్‌ మల్లేశ్వరి తెలిపారు. నాతవరం మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, పంపు ఆపరేటర్లు, పర్యవేక్షణ అధికారులతో తాగునీటి సరఫరాపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేసవిలో తాగునీటి కొరత లేకుండా ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. తాగునీటి పథకాల వాటర్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ క్లోరినేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపిడిఒ యాదగిరీశ్వరావు మాట్లాడుతూ తాగునీటి సౌకర్యం కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.