చిత్తూరు (తిరుచానూరు) : చిత్తూరు జిల్లా తిరుచానూరు మండలం దామినేడు చెరువులో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులు చెరువులోని మృతదేహాలను గుర్తించి తిరుచానూరు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో సిఐ సుధాకర్ రెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తిరుపతిలోని మంగళం జై మార్ట్‌లో పండ్లు, కూరగాయల వ్యాపారం చేసే సాయి కుమార్, వెంకటేష్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల స్నేహితులను విచారించగా కుటుంబ కలహాలే కారణమని తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










