- మ్రొక్కులు తీర్చుకున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం(చిత్తూరు) : గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా డాక్టర్ థామస్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నియామకం చేయడంతో గంగాధర నెల్లూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ భీమినేని చిట్టిబాబు నాయుడు అధ్యక్షతన కటికపల్లి మాజీ ఎంపీటీసీ గుత్తా వేమన్న నాయుడు ఆధ్వర్యంలో శ్రీఆరిమాని గంగమ్మ వారికి ఆదివారం టిడిపి నాయకులు కార్యకర్తలు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు సమర్పించి కోర్కెలను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వేమన్న నాయుడు మాట్లాడుతూ చిట్టిబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మమేకమై నాయకులు కార్యకర్తల తో కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ థామస్ ని అఖండ మెజార్టీ తో గెలిపించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వేమన్న నాయుడు సిద్దయ్య శెట్టి జ్యోతి ప్రకాష్ పైనేని ధనుంజయ నాయుడు చంద్రబాబు రెడ్డి పుల్లూరు దాము భూపతి రెడ్డి జనార్దన్ రెడ్డి ఎల్ బాబు నాయుడు రవిబోయిడు సంజీవి చిరంజీవి రెడ్డి మునస్వామి అభయ్ రెడ్డి కే యం రవి మహేష్ సూరి వేణు బాలాజీ నాయుడు లోకనాథం వెంకటేష్ అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










