Jun 23,2023 09:38

గాజువాక (విశాఖ) : లారీని బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున విశాఖ కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో వద్ద జరిగింది. షీలా నగర్‌ స్పీడ్‌ వైస్‌ లాజిక్‌ స్టిక్స్‌ లో పనిచేస్తున్న ఐదుగురు అచ్చుతాపురంలోని అభిజిత్‌ ఫైర్‌ ఎలాసిస్‌ కార్పొరేషన్‌ లోడింగ్‌ లో రిపేర్‌ చేయడానికి నిన్న రాత్రి 11 గంటల సమయంలో వెళ్లారు. తిరిగి ఈరోజు వస్తుండగా వీరి బొలెరో వాహనం వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి దువ్వాడ పోలీసులు చేరుకున్నారు. మృతులు సునీల్‌ గిరి (20), సాంగ్‌ వాజ్‌ (20)గా గుర్తించారు. మరొకరు మహమ్మద్‌ రాజు ఖాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. మరొక ఇద్దరు నజరుద్దీన్‌, ప్రమోద్‌ పాండేలుగా గుర్తించారు. వీరందరూ బీహార్‌కు చెందిన హెచ్పీసీఎల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులుగా తెలుసుకున్నారు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.