ప్రజాశక్తి - పుత్తూరు టౌన్(తిరుపతి) : గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మంత్రి ఆర్.కె.రోజా పేర్కొన్నారు. వడమలపేట మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జనరల్ బాడీ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రోజా మాట్లాడుతూ.. వడమాలపేట మండలంలోని గడపగడపలో మంజూరైన అభివృద్ధి పనులన్నీ అలాగే నాడు నేడు స్కూల్ రెన్యువేషన్ పనులన్నీ కంప్లీట్ చేయమని అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. హౌసింగ్ సంబంధించిన మండలంలో మిగిలిన వర్కులన్నీ కూడా పూర్తి చేయమని.. అదేవిధంగా గ్రామాలలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పరికరాలు, మెడిసిన్స్ అందుబాటులో ఉండాలని ఏమైనా అవసరమైతే చెబితే ఇమ్మీడియేట్గా రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా తెప్పిస్తామన్నారు. ఈనెల 28వ తేదీన జగనన్న విద్యా జీవన పథకాన్ని లాంఛనంగా.ప్రారంభించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగిరి పట్టణానికి రానున్నరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భానుమూర్తి, తహశీల్దార్ ఈ సుబ్రహ్మణ్యం, జెడ్పిటిసి మురళీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లోకేష్ రెడ్డి, కాయం సింగిల్ విండో అధ్యక్షులు సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు, బాబు సాహెబ్ కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు, మణి రాజు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, మండల. అధికారులు పాల్గొన్నారు.










