ప్రజాశక్తి-పుత్తూరు టౌన్(తిరుపతి) : ఆరేటమ్మ అమ్మవారి బ్రహ్మౌత్సవాల్లో మంత్రి ఆర్.కె రోజా మంగళవారం పాల్గొన్నారు. తొలుత ఆలయానికి విచ్చేన మంత్రి రోజాకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి, అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మనోహర్ రెడ్డి , సదాశివ ఆలయ చైర్మన్ కొడగంటి రమేష్ బాబు, పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ ఏ .హరి, వైస్ చైర్మన్లు, డీ జయ ప్రకాష్, కౌన్సిలర్లు, రాధా, రాష్ట్ర డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










