Sep 04,2023 15:25

ప్రజాశక్తి-అమరావతి : ఇటీవల తమిళ సూపర్‌ స్టార్‌ను వైసీపీ నేతలు టార్గెట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో మంత్రి రోజా కూడా ఉన్నారు. అయితే, ఈరోజు ఆaమె మాట్లాడుతూ రజనీకాంత్‌ను తాను విమర్శించలేదని చెప్పారు. చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండి.. ఏపీని ఇండియాలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి చంద్రబాబు తీసుకొస్తారని చెప్పడాన్ని మాత్రమే తాను ఖండించానని అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందని అన్నానని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే రజనీకాంత్‌ ఇమేజ్‌ తగ్గుతుందన్నారు. ఏపీలో చంద్రబాబుకు ఓటర్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఇల్లు లేవని... హైదరాబాద్‌ నుంచి వచ్చి వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.