ప్రజాశక్తి-అమరావతి : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఏపీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరికి సెన్స్ ఉందా అన్నారు. తప్పు చేసిన భర్తను కాపాడాలని దేవుడిని కోరడం న్యాయమా అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని కారణాలు లేకండా అరెస్ట్ చేయరన్నారు. ఆధారాలు లేకుండా కేసు పెడితే నిలవదు అన్నారు. చట్టం ఎవరికైనా సమానమే అన్నారు. విచారణలో చాలా పేర్లు, అకౌంట్లు బయటకు వస్తాయన్నారు. లోకేష్, ఆయన స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ముందే చెప్పామన్నారు. బాబు అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందన పట్ల మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు విషయంలో సొంత కొడుకు కంటే ఎక్కువగా పవన్ కల్యాణ్ స్పందిస్తున్నాడన్నారు. చివరికి పార్టీని, ఆస్తులని మొత్తం కాజేస్తాడా? అని లోకేశ్ ఆందోళన చెందుతున్నాడని సెటైర్ వేశారు. ఇక ఇవాళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న లోకేశ్, అచ్చెన్నాయుడు త్వరలోనే అరెస్టు కాబోతున్నారని రోజా పేర్కొన్నారు.










