Dec 22,2022 17:15

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల పరిధిలోని యలేరు గ్రామంలో యన్నం రాజారెడ్డి రాతి దూలం లాగుడు పోటీలను తోపుదుర్తి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అన్నం అంతన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో విజేతల కోసం మొదటి బహుమతి రూ.40 వేలు ఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీలత రెడ్డి, రెండో బహుమతి రూ.30 వేలు కడపకు చెందిన దేవగాని రామాంజనేయులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీలత రెడ్డి మాట్లాడుతూ పోటీలను చూడడానికి వచ్చిన వారికి కమిటీ సభ్యులు ఏమాత్రం లోటు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.