ప్రజాశక్తి-మడకశిర (అనంతపురం) : ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ 4వ తరగతి ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని రెండు జిల్లాల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లా డిప్యూటీ డైరెక్టర్లు విశ్వమోహన్ రెడ్డి, శివ రంగ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలో జిల్లా అధ్యక్షులుగా తిప్పయ్య, ఉపాధ్యక్షులుగా మల్లేష్ ప్రధాన కార్యదర్శిగా ముత్యాలప్ప, కోశాధికారిగా శేఖర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న తమ డిమాండ్లను డిప్యూటీ డైరెక్టర్ డైరెక్టర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండు జిల్లాల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.










