ప్రజాశక్తి-గుత్తి(అనంతపురం) : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం గురువారం దాత, జీకే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ యజమాని పిల్లెల్లి కృష్ణయ్య నాలుగు బెంచీలను విరాళంగా ఇచ్చారు. కృష్ణయ్య తండ్రి పిల్లెల్లి వెంకటేష్ జ్ఞాపకార్థం ఈ బెంచీలను ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సి.ఎల్లప్పకు అందజేశారు. అలాగే పురుషుల వార్డు పైకి ఎక్కడానికి రూ.10 వేలు విలువచేసే నిచ్చెనను న్యూ అన్నపూర్ణ హౌటల్ యజమానులు ఎన్.శివప్రసాద్, ఎన్.రవికుమార్‌లు ఆసుపత్రికి అందజేశారని వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో హెడ్ నర్స్ నాగమణి, స్టాఫ్ నర్స్ వరలక్ష్మి, సిబ్బంది రాజేష్, రమణ తదితరులు పాల్గొన్నారు.










