ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇన్ ట్యూషన్ ప్లాంటేషన్‌ను ఏపిడి వెంకటరత్నం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాంటేషన్‌లో మొక్కలు జాగ్రత్తగా పెంచాలన్నారు. 90 శాతం మొక్కలు బతికే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్చార్జి ఈసి విజయనాగేంద్రరెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీ.రామంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










