Jan 21,2023 12:12

కంబదురు (అనంతపురం) : నుతిమాడుగు గ్రామంలో నేడు టిడిపి నేతల పర్యటన ఉన్న నేపథ్యంలో... మడకశిరలోని ముఖ్య టిడిపి నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. కనగనిపల్లి మండల పరిధిలోని నుతిమాడుగు గ్రామ సమీపంలో ఉన్న సుజీలన్‌ కంపెనీకి చెందిన భూములను ఉమ్మడి జిల్లాలలోని ముఖ్యమైన టిడిపి నాయకులు సందర్శించనున్నారని తెలియడంతో... శనివారం తెల్లవారుజామున మడకశిర పట్టణంలోని రాష్ట్ర టిడిపి నేతలు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ని నూతి మడుగు గ్రామానికి వెళ్లనీకుండా పట్టణ స్థానిక ఎస్సై నాగేంద్రప్ప, గుడిబండ ఎస్సైలు హౌస్‌ అరెస్ట్‌ చేసి నోటీసులిచ్చారు.