Jun 15,2023 10:02

ప్రజాశక్తి-కళ్యాణదుర్గం(అనంతపురం): మండలం కొండాపురం పంచాయతీ పరిధిలోని కదరంపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కురుబ పోలేరప్ప కుమారుడు గోవిందు (45) తన వ్యవసాయ పొలంలో గొర్రెల మందకు కాపలాకి బుధవారం రాత్రి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున పోలం పనులకు వెళ్లిన రైతులకు గోవిందు మృతి చెంది కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. తలపై బండరాయితో కొట్టడంతోనే గోవిందు చనిపోయినట్లు అంచనాకు వచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకన్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.