ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : కూలి పని కోసం ఇంటి నుండి సైకిల్ పై బయలుదేరి వ్యక్తిని విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సు ఢీ కొటింది. ఈ ప్రమాదంలో సైకిల్ వెళ్తున్న లక్ష్మినారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈపురిపాలెంకు చెందిన లక్ష్మి నారాయణ కొంత కాలంగా పెంయిట్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. రోజులానే గురువారం పని చేసే చోటుకి సైకిల్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో కళాశాల బస్సు ఢ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










