Mar 15,2023 11:25

ప్రజాశక్తి - అనంతపురం : బైక్‌ని తప్పించబోయి పేపర్‌వ్యాన్‌ అదుపుతప్పింది. రాయదుర్గంలో జరిగిన ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం గేట్‌ వద్ద ద్విచక్ర వాహనం వస్తుండగా రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం వైపు పేపర్‌ వ్యాన్‌ వస్తుండగా - ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్ళింది. అయితే వాహనంలో ఉన్న పలవురికి గాయలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.