ప్రజాశక్తి - నార్పల : కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య బుధవారం ఉదయం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రమైన నార్పల్లో స్థానిక జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు కట్టుదిడ్డమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. ఎనిమిదిన్నరకే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఇతరులు ఎవరూ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించకుండా ఎస్సై రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రతి విద్యార్థి హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి పంపుతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షకు మొత్తం 211 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని పరీక్షా కేంద్రంలోని ప్రతి తరగతికి గదికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ బాలప్ప తెలిపారు. అదేవిధంగా పరీక్షల నిర్వహణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు కూడా సెల్ ఫోను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం లేదని ప్రిన్సిపాల్ తెలిపారు










