ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని తాపేశ్వరం - ద్వారపూడి రోడ్డు పనులు శుక్రవారం పున: ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిన్న రోడ్డు భవనాల శాఖ అధికారులు, కాంట్రాక్టర్ తో కలిసి రోడ్డు పరిస్థితిని పరిశీలించిన అనంతరం సోమవారం నుంచి వేగవంతంగా రోడ్డు పనులు పూర్తి చేసి వినియోగం తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో శుక్రవారం ఈ రోడ్డు లో జరుగుతున్న పనులను ఏ.ఈ సూర్యనారాయణ సమక్షంలో పనులను పర్యవేక్షించారు.










