ప్రజాశక్తి మండపేట (అంబేద్కర్ కోనసీమ) : గత కొంతకాలంగా అభివఅద్ధికి నోచుకోకపోవడంతో పాడైపోయి గోతులమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. రోడ్డు భవనాల శాఖ అధికారులు ఈ రోడ్డుకు మరమ్మతులు శుక్రవారం చేపట్టారు. సుమారు రెండు కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డును రూ.49 లక్షల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నామని జె.ఇ సూర్యనారాయణ తెలిపారు.










