Aug 23,2023 12:34

ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : జిల్లా అధికారులు ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని పారిశుద్ధ కార్మికుల జిల్లా అధ్యక్షులు మధు అన్నారు బుధవారం మండల అభివృద్ధి కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల నిరసన కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ... సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు అభివృద్ధి కార్యాలయ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. జీవో నెంబర్‌ 680 ప్రకారం ... స్వచ్ఛభారత్‌ కార్మికులకు నెలకు పదివేల రూపాయలు చెల్లించాలని, వారికి పిఎఫ్‌, ఈఎస్‌ఐ కల్పించాలని అన్నారు. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనము, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను దఅష్టిలో ఉంచుకొని వేతనాలు పెంచాలని అన్నారు. టెండర్లకు సంబంధం లేకుండా కార్మికులందరినీ కొనసాగించాలన్నారు. యూనిఫాం, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. కాంట్రాక్ట్‌ పనిచేస్తున్నవారిని క్రమబద్దీకరించి పంచాయతీ కార్మికులుగా గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ప్రతి నెల 5వ తారీఖు లోపు వేతనాలను చెల్లించాలని అన్నారు. పంచాయతీ నిధుల్లో ఏదో ఒక నిధిలో కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సౌకర్యాలు అమలు చేసి పారిశుద్ధ్య కార్మికులను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, బాలాజీ, దాసు, బాబు, లక్ష్మి, చిట్టెమ్మ, కృష్ణమూర్తి, అల్లా బాషా, కన్నయ్య, ప్రసాద్‌, ప్రభాకర్‌, మొగిలి అమ్మ, షణ్ముగం, పలువురు పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు, తదితరులు పాల్గొన్నారు.