Apr 16,2023 13:50

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌(చిత్తూరు) : పడమర పేట మండలం, పూడి గ్రామంలో సచివాలయం పక్కన నూతనంగా నిర్మించిన ఈద్గాను మంత్రి ఆర్‌.కె.రోజా ఆదివారం ప్రారంభించారు. తొలుత మంత్రి ఆర్‌.కె.రోజాను ముస్లిం మత పెద్దలు ఘనస్వాగతం పలికారు. వడమాల పేట మండలంలోని ముస్లిం సోదరులు మంత్రిని గజమాలతో, శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మన ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డి ముస్లిం సోదర సోదరిమణులకు విద్య, వైద్యం,ఆర్థిక భరోసా ఇస్తూ సమాజంలో గౌరవంతో పాటు రాజకీయంగా కూడా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. జగనన్న తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం మనం గమనించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వడమాలపేట ఎంపీపీ, విజయలక్ష్మి. వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌, సర్పంచులు, రాష్ట్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.