Aug 14,2023 21:57

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, జనరల్‌ సెక్రటరీ కెవి శివారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (సంక్షేమం) ఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న ఎన్‌జిఒ 21వ రాష్ట్ర మహాసభలకు హాజరుకావాలని కోరారు. అనంతరం సిఎంకు మహాసభల ఆహ్వాన పత్రికను అందజేశారు.