Jun 09,2023 15:27

తాడేపల్లి: ఏపీ ఎన్జీవో నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్‌ లేని ఫించను ఇవ్వాలని సీఎంను కోరామని వెల్లడించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కాంట్రిబ్యూషన్‌ లేని విధానం భారమవుతుందన్నారని చెప్పారన్నారు.జీపీఎస్‌లో ఉద్యోగికి నష్టం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని సీఎం తెలిపారన్నారు. ఉద్యోగ సంఘాల నేతల్లో ఏపీ ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శివారెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, తదితరులు ఉన్నారు.